
ఈ విజయదశమిని
మీరు మీ కుటుంబం సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆశిస్తున్నారు!.
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ,
చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ,
తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ,
దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్..
దుర్గాదేవి తల్లులందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి,
ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకే
మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి,
రక్కసి మూకలను అడగించినయమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల
నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి
నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీతమందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక.
“మీ అందరికి దసరా మరియు విజయ దశమి 2021 శుభాకాంక్షలు!” .
